PDPL: పెద్దపల్లి మండలంలోని రంగాపూర్‌లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన పాలకవర్గం మంగళవారం పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణా రావును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నూతన పాలకవర్గానికి ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలిపారు. గ్రామాభివృద్ధిలో ప్రతి సభ్యుడు ముందుండాలని, ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని ఆయన పేర్కొన్నారు.