PLD: బొల్లాపల్లి మండలం రేమిడిచర్ల గ్రామంలో జలజీవన్ మిషన్ కింద రూ.50.50 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన ఇంటింటి కుళాయిలను వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ప్రారంభించారు. బొల్లాపల్లి మండలాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే తమ లక్ష్యమని తెలిపారు. ప్రతి ఇంటికి శుద్ధమైన తాగునీరు అందించాలన్నదే ప్రభుత్వ సంకల్పమని ఎమ్మెల్యే పేర్కొన్నారు.