ASR: త్రాగునీటి కొరకు తీసిన బోరు నిరుపయోగంగా ఉందని అరకులోయ సీపీఎం పార్టీ నాయకులు సత్యారావు, దామోదర్ పేర్కొన్నారు. మండలంలోని మాడగడ పంచాయతీ, దానిరంగిని గ్రామంలో త్రాగునీటి సమస్య తీవ్రస్థాయిలో ఉందని గ్రామస్తులతో సోమవారం నిరసన తెలిపారు. మంచినీటి కొరకు తీసిన బోరు నిరుపయోగంగా ఉందని అధికారులు స్పందించి గ్రామంలో త్రాగునీటి సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేశారు.