SRCL: సేవ, క్రమశిక్షణ, నైతికతలకు జి. వెంకటస్వామి (కాకా) జీవితం నిదర్శనమని, జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే అన్నారు. జి వెంకటస్వామి (కాకా) వర్ధంతి సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఆయన చిత్రపటానికి ఎస్పీ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ.. సుదీర్ఘకాలం పాటు కేంద్ర మంత్రిగా వ్యవహరించారని అన్నారు.