KMM: పదోన్నతులు బాధ్యతను మరింత పెంచుతాయని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అన్నారు. వివిధ పోలీస్ స్టేషన్లలో హెడ్ కానిస్టేబుల్‌గా బాధ్యతలు నిర్వహించి, నిరంతరంగా సేవలందించి ఏఎస్సైగా ఉద్యోగోన్నతి పొందిన 10 మంది హెడ్ కానిస్టేబుళ్లను పోలీస్ కమిషనర్ కార్యాలయంలో సోమవారం పోలీస్ కమిషనర్ పదోన్నతి చిహ్నాన్ని అలంకరించి, అభినందనలు తెలియజేశారు.