ADB: ఉట్నూర్ మండలం ఉమ్రి గ్రామపంచాయతీ నూతన సర్పంచ్‌గా టేకం కవిత, ఉపసర్పంచ్ తీత్రే కిషన్ వార్డుసభ్యులతో సోమవారం కలిసి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. సభ్యులతోపాటు గ్రామస్థులతో కలిసి గ్రామంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించి గ్రామ అభివృద్ధి లక్ష్యంగా పని చేస్తానన్నారు.