MDK: ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన మెదక్ సీఎస్ఐ చర్చి క్రిస్మస్ వేడుకలకు ముస్తాబైంది. పండుగ పురస్కరించుకుని చర్చిని రంగురంగుల విద్యుత్ దీపాలతో సుందరంగా అలంకరించారు. రాత్రి వేళల్లో చర్చి గోపురాలు దేదీవ్యమానంగా వెలిగిపోతుండటంతో సందర్శకులు మంత్రముగ్ధులవుతున్నారు. వేడుకల కోసం తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు తరలివచ్చే అవకాశం ఉంది.