KMM: పెనుబల్లిలోని వీఎం బంజర్ శివారు ఎన్ఎస్పీ కాలువ సమీపంలో ఇవాళ ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక డీసీఎం డ్రైవర్ ప్రాణాలు కోల్పోయారు. అతివేగంగా వెళ్తున్న డీసీఎం అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వాహనం క్యాబిన్ పూర్తిగా నుజ్జునుజ్జు అవ్వడంతో డ్రైవర్ అందులో ఇరుక్కుపోయారు. ఆయన తల భాగంలో తీవ్ర గాయాలు కావడంతో డ్రైవర్ మృతి చెందారు.