VZM: సిటీ బస్టాండ్ పరిధీలో ఉన్న శ్రీ కనక మహాలక్ష్మీ అమ్మవారి ఆలయంలో పలువురు భక్తులు అమ్మవారికి ఇవాళ సారె సమర్పించారు. ఆలయ ప్రధాన అర్చకుడు గాయత్రి శర్మ ఆధ్వర్యంలో వేకువ జాము నుంచి అమ్మవారికి పుష్పాలతో ప్రత్యేక అలంకరణ చేసి, పూజలు, అర్చనలు,హోమాలు జరిపారు. కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.