అన్నమయ్య: పీలేరు మండలం గూడరేవుపల్లి పంచాయతీ మర్రిమాకులపల్లికి చెందిన బాలే ఆనంద్ (55) శనివారం రాత్రి చెరువులో ప్రమాదవశాత్తు మృతి చెందాడు. చేపల వేటకు వెళ్లి తిరిగి వస్తుండగా నీటిలో పాచి చుట్టుకొని మునిగిపోయినట్లు స్థానికులు తెలిపారు. వెంటనే వారు పీలేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు పేర్కొన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.