AP: శ్రీసత్యసాయి జిల్లా ముత్యాలవాండ్లపల్లిలో అమానుష ఘటన చోటుచేసుకుంది. తమ ఇంటి వద్ద బాణాసంచా కాల్చొద్దన్నందుకు గర్భిణీ సంధ్యారాణిపై అజయ్దేవ్ అనే వ్యక్తి దాడికి పాల్పడ్డాడు. దీంతో తీవ్ర నొప్పితో బాధపడుతున్న సంధ్యారాణిని వెంటనే తనకల్లు ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం కదిరి ఆస్పత్రికి తీసుకెళ్లారు. నిందితుడు YCP కార్యకర్త అని తెలుస్తోంది.