యోగాతో మానసిక సమస్యలు దూరం చేసుకోవచ్చు. ఉదయం చేసే యోగా మనస్సును ప్రశాంతంగా ఉంచుతుంది. చిన్న చిన్న వ్యాయామాలు చేస్తే లంగ్స్ హెల్తీగా ఉంటాయి. యోగా చేస్తే ఒత్తిడికి కారణమయ్యే కార్టిసాల్ అదుపులో ఉంటుంది. జీర్ణక్రియ మెరుగుపడుతుంది. కోపం, ఆందోళన కంట్రోల్ అవుతాయి. ప్రశాంతంగా ఆలోచించే గుణం పెరుగుతుంది. చిన్న వయసు నుంచే యోగా నేర్పిస్తే పిల్లలకు ఆరోగ్యంతోపాటు ఏకాగ్రత పెరుగుతుంది.