HYD: హైదరాబాద్లోని బోయిన్పల్లి నుంచి గుండ్ల పోచంపల్లి, జీడిమెట్ల వరకు జాతీయ రహదారి-44ను ఆరు లైన్లుగా విస్తరించే పనులు చేపట్టారు. ఈ నిర్మాణాల్లో ఇండియన్ రోడ్ కాంగ్రెస్(IRC) ప్రమాణాలను కచ్చితంగా పాటిస్తున్నామని కేంద్రం వెల్లడించింది. ప్రయాణికుల భద్రతే ప్రధానం అనే నినాదంతో పనులు సాగుతున్నాయని, నాణ్యతలో ఎక్కడా రాజీ ఉండదని అధికారులు స్పష్టం చేశారు.