NRPT: ఆస్పిరేషనల్ బ్లాక్ ప్రోగ్రామ్లో భాగంగా నర్వ మండలంలో ఈ నెల 22 నుంచి 24 వరకు కేంద్ర ప్రభారి అధికారి స్వప్నదేవి రెడ్డి పర్యటించనున్నట్లు ఆదివారం జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ సంచిత్ గంగ్వార్ తెలిపారు. 22న కలెక్టరేట్లో జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహిస్తారని, 23, 24 తేదీల్లో క్షేత్రస్థాయిలో నర్వ మండలంలో పర్యటించి అభివృద్ధి పనులను పరిశీలిస్తారని అన్నారు.