TG: టాస్క్ఫోర్స్ ప్రక్షాళనకు హైదరాబాద్ కమిషనర్ వీసీ సజ్జనార్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఒకే రోజు 80 మంది సిబ్బందిని బదిలీ చేశారు. ఎస్సై నుంచి కానిస్టేబుల్ వరకు ర్యాంక్ అధికారులను అటాచ్ చేశారు. అయితే ఇటీవల కాలంలో టాస్క్ ఫోర్స్ అధికారులపై అవినీతి ఆరోపణలు వచ్చాయి. గత కొన్నేళ్లుగా టాస్క్ఫోర్సులో కొంతమంది అధికారులు పాతుకుపోయారు.