SRD: సంగారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని తారా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి ఆధ్వర్యంలో క్యాన్సర్ పై అవగాహన కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ప్రిన్సిపల్ ప్రవీణ మాట్లాడుతూ.. విద్యార్థులకు క్యాన్సర్ పై అవగాహన కల్పించేందుకు ఈ సదస్సు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. క్యాన్సర్ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వైద్యులు వివరించారు.