KDP: రిమ్స్ ఆసుపత్రిలో కార్మికులకు 3 నెలలుగా జీతాలు చెల్లించకుండా, పండగ పూట పస్తులు పెడుతున్నారని రాయలసీమ ట్రేడ్ యూనియన్ నగర కార్యదర్శి మడగలం ప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవాళ ఆయన మాట్లాడుతూ.. 50 ఏళ్లకే పని నుంచి తొలగించే వింత నిబంధనను, తెల్లకాగితాలపై సంతకాల వేధింపులను ఖండించారు. జీతాలు చెల్లించకపోతే కాంట్రాక్టర్ కార్యాలయాన్ని ముట్టడిస్తామన్నారు.