SRCL: గంభీరావుపేట గ్రామ ప్రజలు ప్రజాస్వామ్య వ్యవస్థకు ఆదర్శంగా నిలిచారు. ఏ పార్టీ మద్దతు లేకుండా, రూపాయి ఖర్చు పెట్టకుండా పోటీచేసిన మల్లుగారి పద్మ నర్సాగౌడ్‌ను 2,483 ఓట్ల మెజారిటీతో సర్పంచ్‌గా గెలిపించారు. ‘సేవ చేస్తాను-రూపాయి ఖర్చు పెట్టను’ అంటూ ఎన్నికల బరిలోకి దిగిన పద్మకు 4,109 ఓట్లు పడ్డాయి. బ్యానర్లు, మైకులు లేకుండా సర్పంచ్‌గా పోటీ చేశారు.