హైదరాబాద్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు వరుసగా రెండో రోజు పెరిగాయి. నిన్నటితో పోలిస్తే ఇవాళ 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.930 పెరిగి రూ.1,63,310కు చేరగా.. ఆభరణాలకు వాడే 22 క్యారెట్ల ధర రూ.850 పెరిగి రూ.1,49,700గా పలుకుతోంది. మరోవైపు వెండి ధర కిలోపై రూ.100 పెరిగి రూ.3,00,100కు చేరింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ దాదాపు ఇవే ధరలు ఉన్నాయి.