సత్యసాయి: వైసీపీ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ బుధవారం రాత్రి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని ప్రస్తుత రాజకీయ పరిణామాలు, పార్టీ బలోపేతంపై చర్చించారు. జగన్ నాయకత్వంలో పార్టీ కోసం అంకితభావంతో పనిచేస్తానని మాధవ్ తెలిపారు.