KDP: సిద్ధవటం MPDO కార్యాలయంలో ICDS శాఖ ఆధ్వర్యంలో బుధవారం అంగన్వాడీ కార్యకర్తలకు నూతన 5జి మొబైల్ ఫోన్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి రాజంపేట టీడీపీ ఇన్ఛార్జ్ చమర్తి జగన్మోహన్ రాజు హాజరై సిద్ధవటం, బాకరాపేట సెక్టార్ అంగన్వాడీ కార్యకర్తలకు ఫోన్లను అందించారు. రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ కార్యకర్తలకు అన్ని సౌకర్యాలు కల్పిస్తుందని చమర్తి అన్నారు.