టాలీవుడ్(Tollywood)లో హాస్యభరిత చిత్రాలు తీయడంలో డైమండ్ రత్నబాబు(Director Diamond Ratnababu) తన మార్క్‌ను చూపించారు. గతంలో డైమండ్ రత్నబాబు కామెడీ ఎంటర్టైన్మెంట్ సినిమాలకు రచయితగా పనిచేశారు. తాజాగా ఇప్పుడు ఆయన ‘అన్‌స్టాపబుల్’ సినిమా(Unstoppable movie)తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. బిగ్ బాస్5(Big boss5) విన్నర్ వీజే సన్నీ(Vj Sunny), కమెడియన్ సప్తగిరి(Sapthagiri)తో ఈ మూవీని తెరకెక్కిస్తున్నాడు. ‘అన్లిమిటెడ్ ఫన్’ అనే ట్యాగ్ లైన్‌తో ఈ మూవీ రూపొందుతోంది.
‘అన్‌స్టాపబుల్’ ట్రైలర్:
‘అన్‌స్టాపబుల్’ మూవీ(Unstoppable Movie)ని A2B ఇండియా ప్రొడక్షన్ బ్యానర్‌పై రజిత్‌రావు నిర్మిస్తున్నారు. ఈ మూవీలో నక్షత్ర, అక్సాఖాన్లు హీరోయిన్లుగా నటించారు. తాజాగా ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్(Trailer Release) చేశారు. ఈ మూవీ వినోదంతో పాటు డ్రామా, యాక్షన్, గ్లామర్ వంటి అంశాలతో ప్రేక్షకులను ఆకట్టుకోనుందని చిత్ర యూనిట్ తెలిపింది.
వీజే సన్ని(Vj sunny), సప్తగిరి(Sapthagiri)కి డబ్బు అవసరం ఉండగా వారు డబ్బు కోసం ఏం చేస్తారు? అనే కథాంశంగా ఈ మూవీ రూపొందుతోంది. ట్రైలర్(Trailer)ను వినోదభరితంగా చూపించారు. ఈ మూవీ(Movie)లో బిత్తిరి సత్తి(Bittiri satti), షకలక శంకర్, రఘుబాబు వంటి నటీనటులు కీలక పాత్రలు పోషించారు. ఈ మూవీకి భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ అందించారు.