GDWL: గద్వాల్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో శుక్రవారం ఎన్సీడీ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ మొహమ్మద్ అలీ ఆకస్మిక తనిఖీ చేపట్టారు. ఎన్సీడీ క్లినిక్, సర్వైకల్ స్క్రీనింగ్, ఎల్డర్లీ కేర్, మెంటల్ హెల్త్, పాలేటివ్ కేర్ వంటి వివిధ విభాగాలను సందర్శించి, ప్రజలకు అందిస్తున్న వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన పేషంట్లను, వివిధ రికార్డులను పరిశీలించారు.