JN: జిల్లాలో నిన్న నిర్వహించిన తొలి విడత గ్రామపంచాయతి ఎన్నికల విధులకు గైర్హాజరు అయిన 71 మంది సిబ్బందికి శుక్రవారం షోకజ్ నోటీసులు జారీ చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ తెలిపారు. విధుల్లో నిర్లక్ష్యాన్ని సహించబోమని హెచ్చరించారు. దీనిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.