WGL: బీసీల రాజ్యాధికార సాధన లక్ష్యంగా ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న స్థాపించిన తెలంగాణ రాజ్యాధికార పార్టీ పర్వతగిరి మండల అధ్యక్షుడిగా సోమారం గ్రామానికి చెందిన భైరబోయిన ప్రసాద్ యాదవ్‌ను నియమించారు. శుక్రవారం జిల్లా అధ్యక్షుడు పెండల సంపత్ పటేల్ నియామక పత్రం అందించారు. బీసీల హక్కుల కోసం కృషి చేస్తానని ప్రసాద్ యాదవ్ తెలిపారు.