NLR: కావలిలోని సీసీ రోడ్లు, 6 లైన్ తారు రోడ్డు, డ్రైన్లు పనులకు రూ.35 కోట్లు మంజూరయ్యాయని ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నిధులతో యానాదిరెడ్డి బొమ్మ వద్ద నుంచి బృందావన కాలనీ వరకు డ్రైన్ టు ట్రైన్ సీసీ రోడ్డు, బృందావన కాలనీ నుంచి ముసునూరు హైవే వరకు 6 లైన్ తారు రోడ్డు నిర్మాణానికి త్వరలోనే పనులు ప్రారంభిస్తామని చెప్పారు.