భారత్, సౌతాఫ్రికా జట్ల మధ్య 5 మ్యాచ్ల టీ20 సిరీస్ రసవత్తరంగ సాగుతోంది. తొలి మ్యాచ్లో టీమిండియా, రెండో మ్యాచ్లో సౌతాఫ్రికా విజయం సాధించి 1-1తో సమంగా నిలిచాయి. ఈ జట్ల మధ్య కీలకమైన మూడో టీ20 ధర్మశాల వేదికగా ఆదివారం రోజున జరుగనుంది. అయితే.. గిల్, కెప్టెన్ సూర్యకుమార్ వరుసగా విఫలమవుతుండటం భారత జట్టును కలవరపెడుతోంది.