ఆదిలాబాద్ జిల్లాలోని మావల, బేల, జైనథ్, ఆదిలాబాద్(గ్రామీణం), సాత్నాల, భోరజ్, తాంసి, భీంపూర్ మండలాలకు ఈనెల 14న రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని శుక్రవారం ఎస్పీ అఖిల్ మహాజన్ స్పష్టం చేశారు. ఎన్నికల ప్రచారం ముగిసిందని, అభ్యర్థులు ప్రచారాలు చేస్తే కేసులు నమోదవుతాయని హెచ్చరించారు.