BCలకు 42% రిజర్వేషన్ల కోసమే తమ బిడ్డ సాయి ఈశ్వరాచారి సూసైడ్ చేసుకున్నాడని అతని తల్లి ప్రమీల అన్నారు. BCల కోసం సాయి చనిపోయి వారం అయినా ప్రభుత్వం కానీ, ఇతరులు కానీ తమకు ఎలాంటి సహాయం చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తన అన్న ఎప్పుడూ BCల బాగు కోసమే మాట్లాడేవాడని, ఉద్యమాల్లో పాల్గొనేవాడని సాయి సోదరుడు నందీశ్వర్ తెలిపాడు. తన మరణంతో తమ ఇల్లు పెద్ద దిక్కు లేకుండా పోయిందని వాపోయాడు.