KNR: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించేలా తీర్చిదిద్దాలని స్థానిక సంస్థల జిల్లా కలెక్టర్ అశ్విని తానాజీ వాకాడే పేర్కొన్నారు. విద్యార్థుల భవిష్యత్తును నిర్దేశించేది పాఠశాలలలేనని వారి లక్ష్యసాధనకు చిన్నప్పటి నుంచి విద్యార్థులకు తర్ఫీదు ఇవ్వాలని సూచించారు. శుక్రవారం తిమ్మాపూర్ మండల కేంద్రంలోని మండల పరిషత్, ఉన్నత పాఠశాలను ఇవాళ సందర్శించారు.