EG: తూ.గో జిల్లా వ్యాప్తంగా డిసెంబర్ 13వ తేదీన జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ లోక్ అదాలత్లో రాజీ పడగలిగే క్రిమినల్, సివిల్, కుటుంబ వివాదాలు, చెక్బెన్స్, యాక్సిడెంట్, బ్యాంకుల కేసులు, ప్రీ-లిటిగేషన్ తదితర కేసులను పరిష్కరించనున్నారు. మొత్తం 46 బెంచిలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.