కృష్ణా: నందివాడ మండలం రుద్రపాక గ్రామంలో సచివాలయంలో అనుకుని ఉన్న విద్యుత్ స్తంభానికి పట్టపగలే విద్యుత్ దీపాలు వెలుగుతున్నారని గ్రామస్తులు శుక్రవారం తెలిపారు. ఇలా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం పట్ల గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పట్టపగలే వెలుగుతున్న విద్యుత్ దీపాలని వెంటనే ఆర్పి వేయాలని వారు కోరుతున్నారు.