KRNL: ఆదోని జిల్లా ఏర్పాటు విషయంలో కూటమి ప్రభుత్వం ఆలస్యం చేస్తే, 2029లో వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే జగన్ మోహన్ రెడ్డితో చర్చించి జిల్లాను ప్రకటింపజేస్తామని ఆలూరు ఎమ్మెల్యే విరుపాక్షి స్పష్టం చేశారు. ఇది ఆదోని జిల్లా ప్రజల న్యాయమైన డిమాండ్ అని, పరిపాలనా సౌలభ్యం కోసం ఇది అవసరమని పేర్కొన్నారు. ప్రజల అభిలాష నెరవేర్చడానికి తాను కృషి చేస్తానని హామీ ఇచ్చారు.