TG: కేంద్ర మాజీమంత్రి శివరాజ్ పాటిల్ మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. శివరాజ్ పాటిల్ మృతి దేశానికి, కాంగ్రెస్ పార్టీకి తీరనిలోటని అన్నారు. నైతిక విలువలు, హుందాతనంతో రాజకీయాలు చేశారని కొనియాడారు. ప్రజలకు ఉన్నతమైన సేవలు అందించారని పేర్కొన్నారు.