BDK: మణుగూరు మండలం సమితి సింగారం పంచాయతీ, ముత్యాలమ్మ నగర్లో ఇవాళ ఉదయం పెద్ద ప్రమాదం తప్పింది. బైకును తప్పించబోయిన కారు అదుపుతప్పి కరెంట్ స్తంభాన్ని ఢీకొట్టింది. వేగంగా వాహనాలు రావడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. కారు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జయినా, ఎవరికీ గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.