KMM: బోనకల్ మండలం చిన్న బీరవల్లి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి చండ్ర సరిత విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, బావగారి కోడలు శ్రీలక్ష్మిపై సరిత 23 ఓట్ల స్వల్ప మెజార్టీతో సర్పంచ్ పీఠాన్ని కైవసం చేసుకున్నారు. ఫలితాల అనంతరం సరిత అనుచరులు టపాసులు కాల్చి, మిఠాయిలు పంచుకుంటూ విజయోత్సవాలు జరుపుకున్నారు.