TG: రెండోవిడత పంచాయతీ ఎన్నికల ప్రచారానికి ఇవాళ్టితో తెరపడనుంది. దీంతో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అభ్యర్థులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. మరోవైపు ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం పోలింగ్ ప్రక్రియకు సంబంధించిన ఏర్పాట్లల్లో నిమగ్నమై ఉంది. పోలింగ్ సామగ్రిని మండల కేంద్రాలకు తరలించే ప్రక్రియ కొనసాగుతోంది. కాగా ఈ నెల 14న రెండో విడత ఎన్నికలు జరగనున్నాయి.