AP: అల్లూరి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో ప్రాణనష్టం సంభవించడం బాధాకరమని అన్నారు. బాధితులకు, వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు తెలిపారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు రూ.2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50 వేలు చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించారు.