NZB: జిల్లాలో రెండో విడత పంచాయతీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రం తెరపడనుంది. ఈ నెల 14న ఎనిమిది మండలాలలో 196 గ్రామ సర్పంచ్లు, 1,760 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు 44 గంటల ముందుగానే ప్రచారాన్నిముగించాల్సి ఉండటంతో ధర్పల్లి, డిచ్పల్లి, ఇందల్వాయి, మాక్లూర్, మోపాల్, నిజామాబాద్, సిరికొండ, జక్రాన్పల్లి మండలాలలో ప్రచారం ముగియనుంది.