AP: అల్లూరి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 9 మంది మృతిచెందారు. తెల్లవారుజామున ప్రమాదం జరగడంతో సహాయ చర్యలకు ఆలస్యం అవుతోంది. సిగ్నల్ లేని ప్రాంతం కావడంతో ఆలస్యంగా 108 అంబులెన్స్‌లకి ఫోన్లు చేశారు. దట్టమైన పొగమంచుతో దారి కనిపించకే ప్రమాదం జరిగిందా? ఘాట్ రోడ్డులో జర్నీ డ్రైవర్‌కు కొత్త కావడం వల్లే బస్సు బోల్తా పడిందా? అనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు.