AKP: నక్కపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పట్టుబడిన వారిలో ఒకరికి ఏడు రోజులు జైలు శిక్ష విధిస్తూ ఎల్లమంచిలి కోర్టు గురువారం తీర్పు చెప్పినట్లు ఎస్సై సన్నిబాబు తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న 13 మందిపై కేసులు నమోదు చేశామన్నారు. 12 మందికి రూ.10,000 చొప్పున జరిమానా విధించినట్లు పేర్కొన్నారు.