SRD: పటాన్ చెరు మండలంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. భానూరు గ్రామ సర్పంచిగా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి తోకల శాంతయ్య గెలుపొందారు. దీంతో గ్రామంలో పార్టీ నాయకులు టపాసులు కాల్చి సంబరాలు చేసుకున్నారు. తనను ఆదరించి గెలిపించిన గ్రామ ప్రజలకు వారు ధన్య వాదాలు తెలియజేశారు.