W.G: పోడూరు మండలం పండితవిల్లూరులో గ్రామీణ జలజీవన్ మిషన్ పథకంలో భాగంగా రూ. 90 లక్షల వ్యయంతో పైప్ లైన్ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ నిన్న శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రతి ఇంటికి రక్షిత మంచినీరు అందించేందుకు కోటమి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందన్నారు. గ్రామీణ అభివృద్దే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు.