NRML: ఖానాపూర్ పట్టణంలోని అతి పురాతన అన్నపూర్ణ మహాదేవాలయంలో కాలభైరవ స్వామి వార్షికోత్సవం ఈనెల 12న నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు ప్రకటనలో తెలిపారు. ఉత్సవాల్లో భాగంగా గణపతిపూజ, పుణ్యహవచనం, ఆలయ శుద్ధి, అభిషేకం, మహా చండీయాగం, కాలభైరవ హోమం, పూర్ణాహుతి తదితర పూజాది కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు పండితులు కీర్తి రాఘవశర్మ తెలిపారు.