BHPL: మహాముత్తారం మండల కేంద్రానికి చెందిన BRS నాయకుడు పెరుమండ్ల రాజేందర్ ఇవాళ BRS పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ సీనియర్ నేత లింగమళ్ల శారద దుర్గయ్య ఆయనకు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రాజేందర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీలో చేరానని ఆయన అన్నారు.