SRD: జిల్లాలో ఈ నెల 11,14,17 తేదీలలో జరుగనున్న పంచాయతీ ఎన్నికల సందర్భంగా పోలింగ్ కేంద్రాలున్న పాఠశాలలకు స్థానిక సెలవు ప్రకటించాలని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు మంగళవారం తెలిపారు. పోలింగ్ కేంద్రాలు లేని పాఠశాలలు యథావిధిగా పని చేస్తాయని పేర్కొన్నారు. ఈ విషయాన్ని అన్ని పాఠశాల యజమానులు గమనించాలని సూచించారు.