NZB: నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా నియోజకవర్గానికి రూ.100 కోట్ల నిధులు తీసుకొచ్చానని చెప్పడంపై మాజీ ఎమ్మెల్యే బీగాల గణేష్ గుప్తా ఫైర్ అయ్యారు. ఎక్కడి నుంచి రూ. 100 కోట్లు తీసుకొచ్చారో ఎమ్మెల్యే చెప్పాలని ప్రశ్నించారు. గతంలో బీఆర్ఎస్ హయాంలోనే అర్బన్ నియోజకవర్గానికి నిధులు మంజూరు అయ్యాయని, కానీ ఇందులో ఆయన చేసింది ఏమీ లేదన్నారు.