W.G: మంగళవారం అర్ధరాత్రి నుంచి తలపెట్టిన లారీల నిరవధిక సమ్మెను 4 రోజులు వాయిదా వేసినట్లు పాలకొల్లు లారీ అసోసియేషన్ అధ్యక్షులు వలిరెడ్డి వరహాలు, కార్యదర్శి ఆకుల రవి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం పెంచిన రవాణా వాహనాల ఫిట్నెస్ పన్ను యథాతథంగా ఉంచడానికి కృషి చేస్తున్నట్లు అందుకు సమయం కోరిందని వివరించారు. సమ్మెకి సహకారం అందించిన లారీ యజమానులకు కృతజ్ఞతలు తెలిపారు.