NLG: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మూడు విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్ ఉపసంహరణ ప్రక్రియ మంగళవారంతో ముగిసింది. ఎవరు బరిలో కొనసాగుతున్నారో పూర్తి స్పష్టతతో పాటు సర్పంచ్, వార్డు అభ్యర్థుల గుర్తులు కూడా వచ్చాయి. ఎన్నికల పోరు మాత్రమే మిగిలింది. అభ్యర్థులు ప్రచారానికి సిద్ధమవుతుండగా, శ్రేణుల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తుంది.