KDP: కమలాపురం నగర పంచాయతీ కార్యాలయంలో మంగళవారం ఛైర్పర్సన్ మార్పురి మేరీ అధ్యక్షతన జరిగిన సాధారణ కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఎమ్మెల్యే పుత్తా కృష్ణ చైతన్య రెడ్డి పాల్గొన్నారు. పట్టణాభివృద్ధికి సంబంధించిన పలు కీలక పనులకు కౌన్సిల్ ఆమోదం తెలిపింది. ఈ సమావేశంలో మున్సిపల్ అధికారులు, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు పాల్గొని వార్డుల సమస్యలపై చర్చించారు.